హిట్ లు కావాలా నాయనా?

సినిమా హిట్ అంటే కొనుక్కోలేము కానీ, యూట్యూబ్ హిట్ లు హ్యాపీగా కొనేసుకోవచ్చు. ట్రయిలర్ బాగాలేకున్నా, మిలియన్లకు మిలియన్ల హిట్ లు రప్పించేసుకోవచ్చు. ట్రయిలర్ లేదా టీజర్ విడుదలకు ముందే ఈ హిట్ లు సమకూర్చిపెట్టే సంస్థతో డీల్ పెట్టుకోవాలి. మిలియన్ హిట్ లకు ఇప్పుడు లక్షన్నర చార్జ్ చేస్తున్నారు. 

ఎన్ని మిలియన్లు కావాలంటే అన్ని లక్షన్నరలు అన్నమాట. వాళ్లు వీడియోను ముందుగానే ఎస్టాబ్లిష్ చేసి వుంచుకున్న ఫేస్ బుక్ గ్రూపుల్లో వేయడం, కాస్త ఖర్చుచేసి, యూట్యూబ్ వీడియోలకు ముందుగా ప్రకటనల మాదిరిగా వేయడం వంటి రకరకాల కార్యక్రమాలు చేపడతారు. దాంతో క్లిక్కులే క్లిక్కులు.

చిత్రమేమిటంటే హీరోలే పని గట్టుకుని ఈ పని కావాలని అడుగుతున్నారు. నిర్మాత తప్పని సరిగా డబ్బులు ఖర్చుచేసి హిట్ లు కొంటున్నారు. అందువల్ల ఏం జరుగుతోంది అంటే, హీరోలు తమ సినిమాల ట్రయిలర్లు, టీజర్లు భయంకరంగా ఆదరణ పొందేసాయి అని ఆత్మవంచన చేసుకుంటున్నారు. 

తమ హీరో స్టామినా, కంటెంట్ అధిరిపోయింది కనుకే హిటలు వస్తున్నాయని హీరో యూనిట్ జనాలు అంటారు. క్లిక్ చేయడానికి కంటెంట్ తో సంబంధంలేదు. ఆటోమెటిక్ వీడియో ప్లే ఆప్షన్ వున్నా, లక్షలాది జనాలకు నోటిఫికేషన్లు వెళ్లినా, ఫేస్ బుక్ వాల్ మీద ఆటోమెటిక్ గా ప్లే అయినా, హిట్ ల కౌంట్ పెరుగుతుంది. హీరోలు హ్యాపీ అవుతారు.

అయినా ఇంక కొన్నాళ్లకి  ఈ వన్ మిలియన్, టూ మిలియన్ అన్నవి పెద్దగా లెక్కలోకి రావేమో? అప్పుడు నిర్మాతలకు మరింత డబ్బుల ఖర్చు. అంతేగా.. అంతేగా 

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా? 

Show comments