నందుకు మూడు సినిమాలు గ్యారంటీ

పొగడ్తలకు పడని వాళ్లు వుంటారా? అబ్బే సమస్యే లేదు. అందులో సినిమా జనాలు అంటే వీర లెవెల్లో సూపర్ అంటే సూపర్ అని అనాలే కానీ, ఇట్టే పడిపోవడానికి రెడీగా వుంటారు. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడిప్పుడే ఒకటీ అరా సినిమాలు చేస్తున్న నందూకి కనీసం మూడు సినిమాలు గ్యారంటీ అనుకోవాలి. 

ఎందుకంటే అతగాడు ఆ రేంజ్ లో ముగ్గురని పట్టుకుని గాల్లోకి ఎత్తేసాడు మరి. ఇదంతా ఈ ఉదయం జరిగిన జయ జానకీ నాయక యూనిట్ మీట్ సంగతే. ఈ మీట్ లో ఎవరి మాటలు ఎలా వున్నా, నందు మాత్రం ఓ అరగంట టైమ్ తీసుకున్నాడు తన ప్రసంగానికి. దర్శకుడు బోయపాటి గురించే పది నిమషాలు పైగా మాట్లాడాడు.

అసలు ఆయనేమిటి? ఆయన వర్కింగ్ స్టయిల్ ఏమిటి? అసలు ఆర్టిస్టులను పిండేయడం ఏమిటి? అబ్బో? ఓ రేంజ్ లో మాట్లాడాడు. కానీ మధ్య మధ్యలో తాను పొగడడం లేదని అన్నీ నిజాలే అని గుర్తు చేస్తూ వచ్చాడు.

అది అయిపోయిన తరువాత హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ను పట్టుకున్నాడు. అక్కడ ఓ పది నిమషాలు వేసుకున్నాడు. కానీ మళ్లీ అక్కడితో ఆగలా. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి స్టార్ట్ చేసాడు. ఆమె డిసిప్లిన్, వర్క్ హాలిక్ ఇతరత్రా వ్యవహారాలు చెప్పడానికి ఓ పది నిమషాలు తీసుకున్నాడు.  Readmore!

నందు మాటలు వింటూ ఆ ముగ్గురూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందించారు. కచ్చితంగా బోయపాటి మరో సినిమా నందుకు ఇవ్వడం పక్కా అనుకోవాలి. పనిలో పని బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ తమ తరువాతి సినిమాలకు నందును రికమెండ్ చేసే అవకాశం వుంది.

Show comments