హారిక హాసినిలో మళ్లీ దేవీ?

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల ఆడియో ఇప్పటికీ జనాలకు బాగా గుర్తే. సూపర్ హిట్ ఆడియో. అయితే దర్శకుడు తివిక్రమ్ కు ఛేంజ్ కావాలని అనిపించింది, దాంతో హారిక హాసిని సంస్థ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టింది. మిక్కీ జె మేయర్, అనిరుధ్, గోపీసుందర్, లెటెస్ట్ గా థమన్. అయితే మళ్లీ దేవీశ్రీప్రసాద్ హారిక హాసినిలోకి ఎంటరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

నితిన్-రష్మికలతో దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి నిర్మాణం హారిక హాసిని సిస్టర్ కన్సర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నే. ఈ సినిమాకు మంచి ఆర్టిస్ట్ అండ్ టెక్నికల్ ప్యాడింగ్ ఇవ్వాలని చూస్తున్నారు.

సాయి కార్తీక్ ను సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు. మ్యూజిక్ డైరక్టర్ గా దేవీశ్రీప్రసాద్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. పైగా నితిన్-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ అన్నది రేర్ గా వుంటుందని అనుకుంటున్నారు.

కానీ దర్శకుడు వెంకీ కుడుమల మాత్రం ఇంకా ఛలో స్థాయిలోనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రష్మీ, సాయి కార్తీక్ లను రిపీట్ చేసినట్లుగానే, మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ను తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కానీ దేవీ ఎంటర్ అయితే సినిమాకు వుండే క్రేజ్ వేరు. అడియో రేంజ్ వేరు. వెంకీ కుడుమల ఏం చేస్తారో మరి?

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి