ఇంకా ఎక్కడి అదుర్స్ 2

ఎన్టీఆర్ అదుర్స్ సీక్వెల్ చేస్తున్నాడంటూ తెగ గ్యాసిప్ లు.  నిజానికి ఆ సీక్వెల్ ను ఎప్పుడో స్మూత్ గా బన్నీ టేకోవర్ చేసేసాడని మరిచిపోతున్నారు.

అదుర్స్ లో ఎన్టీఆర్ నటించి మెప్పించిన బ్రాహ్మిన్ క్యారెక్టర్ కు ఎక్స్ టెన్షన్ నే ఇప్పుడు బన్నీ చేస్తున్నాడు. అదే డీజె..దువ్వాడ జగన్నాధమ్.

అదుర్స్ వచ్చిన తరువాతే ఈ ప్లాట్ ను, ఆ క్యారెక్టర్ ఎక్స్ టెన్షన్ ను దర్శకుడు హరీష్ శంకర్ డెవలప్ చేసారు. ఎన్టీఆర్ కు వినిపించారు కూడా. అయితే రామయ్యా వస్తావయ్యా తరువాత హరీష్ ను అందరూ దూరం పెట్టడంతో అది అలా వుండిపోయింది. అక్కడి నుంచి అలా అలా బన్నీ దగ్గరకు చేరింది. అదే క్యారెక్టర్ కాన్సెప్ట్ తో కథ తయారై, ఇప్పుడు దువ్వాడ జగన్నాధమ్ గా రెడీ అయిపోతోంది.

మరి ఇప్పుడు ఇంకా ఎన్టీఆర్-అదుర్స్ సీక్వెల్ అని గ్యాసిప్పులేమిటో?

Show comments