అందరికీ విలన్ అంటే నో?

ఆది పినిశెట్టి. హీరోగా సరైన హిట్ లు తెలుగులో పడడం లేదు. సరైనోడు సినిమాతో విలన్ గా కనిపించాడు. అల్లు అర్జున్ హీరో, బోయపాటి డైరక్టర్. అందుకే ఊ అనేసాడు. మరి అలా అని చెప్పి, ప్రతి వాళ్లు విలన్ గా వస్తావా? అంటే ఊ అంటాడా? నో అంటాడు కానీ. అదే జరిగింది. రాజ్ తరుణ్ హీరోగా దొంగాట వంశీకృష్ణ  డైరక్షన్ లో సినిమాకు విలన్ కావాలి. ఆది పినిశెట్టిని అడిగితే నో అన్నాడని తెలుస్తోంది. 

భాగమతి సినిమాలో కీలకమైన పాత్ర వేస్తున్న తరుణంలో, రాజ్ తరుణ్ సినిమాలో విలన్ గానా? సారీ అనేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ రాజ్ తరుణ్ సినిమా అని నో అన్నాడా? లేక అసలు ఇక తెలుగులో విలన్ పాత్రలు వేయకూడదని డిసైడ్ అయ్యాడా? కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.

Show comments