'దేవదాస్' దెబ్బకి

సినిమా హిట్ అయితే ఒకలా వుంటుంది. తేడాకొడితే మరోలా వుంటుంది. భలే మంచిరోజు సినిమాతో సినిమాలు స్టార్ట్ చేసి, శమంతకమణి లాంటి యావరేజ్, దేవదాస్ లాంటి ఫ్లాపు సినిమాలు ఇచ్చిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యం పరిస్థితి ఇలాగేవుంది. ఇప్పట్లో ఏ హీరో చాన్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఓ కొత్త హీరోను తెరకు పరిచయం చేసే పని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

ఇంతకీ ఎవరా? కొత్త కుర్రాడు అంటే... గల్లా అశోక్ పేరు వినిపిస్తోంది. తెరపైకి రావాలని సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కోరిక. తండ్రి గల్లా జయదేవ్ సపోర్ట్ వుండనే వుంది. కానీ తొలి ప్రాజెక్టునే మధ్యలో ఆగిపోయింది. మహేష్ బాబు మొహమాటం కోసం నిర్మాత దిల్ రాజు ప్రాజెక్టు స్టార్ట్ చేసారు.

కానీ కుర్రాడి నటన అదీ సెట్ కాక, ఆ ప్రాజెక్టును అలా వదిలేసి, అదే డైరక్టర్ ను, సబ్జెక్ట్ ను హీరో రాజ్ తరుణ్ కు మార్చి సినిమా తీసేసారు. నవంబర్ 9న విడుదలకు రెడీ చేసేసారు. సరే లవ్ సినిమాలు అంటే ఫీలింగ్స్ అవీ రావాలి, యాక్షన్ సినిమాలు అయితే గల్లా వారి అబ్బాయికి సూట్ అవుతాయేమో అనే ఆలోచనతో ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతున్నట్లు బోగట్టా.

ఓ యాక్షన్ కామెడీ సబ్జెక్ట్ ను తీసుకుని, శ్రీరామ్ ఆదిత్యతో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమతో అయినా తన సత్తా నిరూపించుకుంటారేమో శ్రీరామ్ ఆదిత్య.. వెయిట్ అండ్ సీ. 

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే

Show comments

Related Stories :