‘అపూర్వం’గా చెప్పేసిందే

అపూర్వ అంటే టాలీవుడ్ లో అంత గుడ్ మార్కులు ఏమీ లేవు. వేసే పాత్రలు అలాంటివే. ఆమె గురించి గ్యాసిప్ లు అలాంటివే. ఇప్పుడు ఏటికి ఎదురీదినా ఆమెకు పోయేదేం లేదు. అందుకేనేమో, ఇండస్ట్రీ అంతా వీలైతే చలపతిరావును ఖండించినా, కాకపోతే, సైలెంట్ అయిపోయినా, అపూర్వ మాత్రం కుండ బద్దలు కొట్టింది. చలపతిరావు బాబాయ్ మంచోడు. అతను ఫన్ కోసం అలా మాట్లాడుతాడు తప్ప, మనసులో ఏమీ వుండదు అంటూ.

జనాలు కూడా అలాగే తయారయ్యారు. ఏదో ఒక డబుల్ మీనింగ్ వుంటే తప్ప విడియోలు చూడడం లేదు, వార్తలు చదవడం లేదు. మరి వాళ్లను ఏమనాలి? చలపతిరాలు ఎప్పుడూ ఏ అమ్మాయినీ పిలిపించుకోలేదు. కానీ ఇండస్ట్రీలో తాతలైపోయిన చాలా మంది పక్కనే వుండి, టచ్ చేస్తూ, లంచ్ టైమ్ లో రూమ్ కు వస్తావా అని పిలిచేవారు వున్నారు అని చెప్పేసింది.

అసలు చలపతిరావు చుట్టూ వున్నవారు, ఆయన సంగతి తెలిసిన వారు, ఆయన గురించి ఎందుకు మంచిగా మాట్లాడడం లేదు అని నిలదీసింది. అయితే పనిలో పనిగా చలపతిరావు అన్న మాటలు తప్పే, మరి అమ్మాయి అయి వుండీ ఏంకర్ అలా అడగడం ఏమిటీ? అని ప్రశ్నిస్తోంది కూడా. ఏదైనా అపూర్వ చిన్న నటి అయినా పెద్ద మాటలు బాగానే మాట్లాడింది.

Show comments