జమ జచ్చ..మన్మధ రేఖ

జమ జచ్చ అనగానే గుర్తుకు వచ్చేస్తుంది లేడీస్ టైలర్. హీరో రాజేంద్ర ప్రసాద్ ఎవర్ గ్రీన్ హిట్. డైరక్టర్ వంశీ కి మరుపురాని సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ వస్తోంది. సుమంత్ అశ్విన్ హీరో. లేడీస్ టైలర్ కొడుకే ఫ్యాషన్ డిజైనర్. అందుకే ఈ సినిమాలో కూడా జమ జచ్చ లాంటి సెంటిమెంట్ ఒకటి వుంటుందట. 

ఆ మాటకు వస్తే ఫ్యాషన్ డిజైనర్ లైన్ కూడా లేడీస్ టైలర్ లైన్ లోనే నడుస్తుంది. అందులోనూ ముగ్గురు హీరోయిన్లు, ఇందులో ముగ్గురు. హీరో ముగ్గురి మధ్య ఇరుక్కోవడం వంటి వ్యవహారాలు అన్నమాట. ఇదిలా వుంటే ఈ సినిమాలో హీరోకు అరచేతిలో మన్మధ రేఖ వుంటుందట. అది వున్నవారికి అమ్మాయిలు ఇట్టే పడిపోతార్ట. లేడీస్ టైలర్ లో జమ జచ్చ వున్న అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు. ఈ సినిమాలో తన చేతిలోనే మన్మధ రేఖ వుంటుంది హీరోకు.

మొత్తానికి డైరక్టర్ వంశీ సీక్వెల్ కు వంటకం బాగానే వండినట్లుంది.ఈ సినిమా మే లో విడుదలకు సిద్దం అవుతోంది.

Show comments