చంద్రబాబు పూర్తిగా లోంగిపోయారు

కొన్నినెలల క్రితం బాబుగారి అనుకూల దినపత్రికలు, ఆయన మనసులోని మాటలను అచ్చేసే కరపత్రికల్లాంటి డైలీ పేపర్లను చూస్తే ఓ విషయం అర్థం అవుతుంది. ఈసారి బాబుగారు సగం మంది సిట్టింగ్ లకు టికెట్ లు ఇవ్వరు. మొత్తం 175 టికెట్ లు ఇవ్వడంలో పూర్తి వైవిధ్యం, కొత్తదనం పాటిస్తారు. సర్వేలు చేసి, గెలుపు గుర్రాలు అనుకున్నవారికే టికెట్ లు ఇస్తారు. ఇలా చాలా విషయాలు అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి.

కానీ తీరాచూస్తే ఇప్పుడు పరిస్థితి ఫుల్ గా రివర్స్ లో కనిపిస్తోంది. దాదాపు సిట్టింగ్ లకే టికెట్ లు ఇచ్చేసారు. చాలాచోట్ల ఆయన మార్చాలనుకున్నా మార్చలేకపోయారు. కొందరిని పక్కన పెట్టాలనుకున్నా వీలుకాలేదు. గంటా శ్రీనివాసరావును ఎంపీకి పంపాలనుకున్నారు. ససేమిరా అన్నారు. బాలయ్య రెండో అల్లుడికి ఈ దఫా రాజకీయ ఎంట్రీ లేదనుకున్నారు. కానీ తప్పలేదు. ఇవి కేవలం శాంపిల్స్ మాత్రమే. ఇంకా చాలామందికి బాబుకు ఇష్టంలేకపోయినా టికెట్ లు ఇవ్వక తప్పలేదు.

కొన్నిచోట్ల ఆయనకు ఇష్టం లేకపోయినా తలొగ్గి వారసులకు టికెట్ లు ఇచ్చారు. కొన్నిచోట్ల స్థానాలు మార్చాలనుకున్నా మార్చలేకపోయారు. మొత్తంమీద తెలుగుదేశంలో గట్టిగా పునాదులు వేసుకున్న చాలామంది పంతం ముందు బాబుగారి మాట చెల్లలేదు. ఇదంతా కేవలం వాళ్ల గట్టిదనం కాదు. పరిస్థితులు వైకాపాకు అనుకూలంగా మారడం.

దాంతో ఈ పరిస్థితులను మరింత బ్యాడ్ చేసుకోవడం ఇష్టంలేక చంద్రబాబు నాయకులు ఎలా అంటే అలా ఆడేసారు. వాళ్ల మాటకే సై అన్నారు. మొత్తంమీద 70 ఏళ్ల వయసులో చంద్రబాబు తన పంతాలను, పట్టుదలలను వీడి రాజకీయం చేయాల్సి వస్తోంది.

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments