హహ్హా.. బీజేపీని గేలిచేసిన చంద్రబాబు!

ఎక్కడో కాలుతున్నా.. బీజేపీ మీద విమర్శలు చేసేశాడు చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్తంగా బీజేపీని జనాలు తిరస్కరించేశారని బాబు చెప్పుకొచ్చాడు. యథారీతిన ఈ మధ్యకాలంలో బీజేపీ మీద ఏ విమర్శలను అయితే చేస్తూ వచ్చాడో అవే విమర్శలు చేశాడు. బీజేపీ హయాంలో వ్యవస్థ అంతా పాడైపోయిందని చెప్పుకొచ్చాడు.

అయినా ఈ మాటల వల్లే తెలంగాణలో పార్టీ దుకాణం బంద్ అయ్యింది. ఏపీలో ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులు ఇచ్చి, తెలంగాణలో మాత్రం అలాంటి వాళ్లను ఓడించాలని పిలుపునిస్తే.. మేనకోడలిని కూడా ఓడించి పంపించారు తెలంగాణ జనాలు.

ఒకవైపు ఏపీలో సర్వవ్యవస్థలనూ భ్రష్టు పట్టించేసి.. బీజేపీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని బాబు మళ్లీ అవే నీతులే చెబుతున్నాడు. అంతజేసీ బీజేపీతో నాలుగున్నరేళ్ల సంసారం చేసిన ఘనుడు ఈయనే. బాబు మాట్లాడే ఈ తీరు నచ్చకే జనాలు తెలుగుదేశాన్ని రిజెక్ట్ చేశారు తెలంగాణలో. బాబు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఏపీలో కూడా అదే తప్పదు కూడా!

ఒకవైపు తెలంగాణలో మహాకూటమి చిత్తు అయితే, తను గెలిపించడానికి ప్రచారం చేసిన తన పార్టీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడితే, తనే అభ్యర్థులను ఎంపిక చేసి, అంతా తానై నడిపిన కూటమి చిత్తు చిత్తుగా ఓడితే.. తను ఎవరినైతే ఓడించమని పిలుపునిచ్చాడో అలాంటి వారినే తెలంగాణ జనాలు గెలిపిస్తే.. ఆ విషయం గురించి మాట్లాడకుండా.. చంద్రబాబు నాయుడు ఎక్కడో బీజేపీ ఓడిన విషయం గురించి మాట్లాడాడు.

తెలంగాణలో తనను, తన పార్టీని, తన కూటమిని, తన దోస్తు కాంగ్రెస్ ను తిరస్కరించిన విషయాన్ని పక్కనపెట్టి.. బీజేపీ ఓడిందని బాబు గేలి చేస్తున్నాడు. ఈ గురివింద మాటలతోనే చంద్రబాబు నాయుడు తన అధికారానికి శుభంకార్డు వేసుకునే దిశగా సాగుతున్నాడు.

Show comments