చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్ సందీప్?

ఒక కథను ఎనిమిది మంది హీరోలు నో అన్నా కూడా దాని రచయితకు దాని మీద ప్రేమ చావక పోవచ్చు.. కానీ విన్నవారు అది వర్కవుట్ అవుతుందా కాదా అన్నది చూసుకోవాలి. ఎనిమిది మంది హీరోలు నో అన్నారంటే, అది వర్కవుట్ కాదని వారికి తెలిసి వుండాలి. మరి సందీప్ కిషన్ ఎందుకు ఎస్ అన్నాడు..ఎలా ఓకె అన్నాడు. ఇదంతా ఒక్క అమ్మాయి తప్ప సంగతే.. ఇప్పుడు ఆ ఎనిమిది మంది హీరోల జడ్జిమెంట్ నే కరెక్ట్ అని తేలిపోయింది. 

ఎంత స్వంత కథ అయినా, మితిమీరిన ప్రేమతో దాన్నే పట్టుకువేలాడ కూడదన్న నిజం డైరక్టర్ కు తెలిసివచ్చి వుంటుంది..అసలే కెరీర్ ఒడిదుడుకుల్లో వున్నపుడు సందీప్ మరీ ఇంత ధైర్యం ఎందుకు చేసాడో..ఆఖరికి అల్లు శిరీష్ కూడా నో చెప్పిన కథను తాను ఓకె చేయడం ద్వారా?

Readmore!
Show comments