తీసుకున్నది పాకెట్ మనీనే

బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శీను టైమ్ లోనే కమిట్ అయ్యాడు బోయపాటి శ్రీనివాస్ అదే హీరోతో మళీ సినిమాకు. కానీ కారణాంతరాల వల్ల ఇప్పటికి అది సాధ్యమయింది. అయితే అప్పట్లో వినిపించిన విషయం ఏమిటంటే, బెల్లంకొండ సురేష్ ఏకంగా తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చి, బోయపాటిని బ్లాక్ చేసాడని. అలా రెమ్యూనిరేషన్ కు టెంప్ట్ కావడంతోనే, తప్పని సరిగా బాలయ్య బాబు వందో సినిమా కూడా వదులుకుని జయ జానకీ నాయక సినిమా చేయాల్సి వచ్చిందని గ్యాసిప్ లు వినిపించాయి.

కానీ అవన్నీ నిజం కాదంటున్నాడు బోయపాటి. తన ప్రస్తుత రెమ్యూనిరేషన్ తో పోల్చుకుంటే, జయ జానకీ నాయక సినిమాకు తీసుకున్నది కేవలం పాకెట్ మనీ మాత్రమే అంటున్నారు. అప్పట్లో రేట్ల ప్రకారం కమిట్ అయ్యానని, అందరూ అనుకుంటున్నట్లు తొమ్మిది కోట్లు కాదని, ఆ మాటకు వస్తే, ఈ సినిమా కన్నా సరైనోడు సినిమాకే ఎక్కువ పారితోషికం తీసుకున్నానని అన్నారు.

మనిషి అన్నాక, ఓ మాట, ఓ పద్దతి వుండాలని, అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సినిమా చేసాను తప్ప, రెమ్యూనిరేషన్ ఎక్కువ అని కాదని వివరించారు. కానీ చేసిన తరువాత ఈ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి పద్దతికి దాసోహం అయిపోయానని, కచ్చితంగా అదే నిర్మాతకు మళ్లీ మరో పెద్ద హీరో సినిమా చేస్తానని, ఇది తన వాగ్దానమని అన్నారు.

Show comments