అంతేగా.. అనిల్ రావిపూడి.. అంతేగా

తన సినిమాల్లో ఓ మాంచి కాయినింగ్ వర్డ్ పెట్టి, ఫన్ పండించడం దర్శకుడు అనిల్ రావిపూడికి అలవాటు. ఎఫ్ 2లో హీరోయిన్ తమన్నా ఫ్యామిలీలో 'అంతేగా.. అంతేగా' అన్న పదం రకరకాలుగా వినిపించి ఫన్ పండించారు. అంతకు ముందు రాజా ది గ్రేట్ లో కూడా అలాంటి ప్రయోగమే రవితేజ, శ్రీనివాస రెడ్డిలతో 'హుహుహూహూ... హుహుహూహూ'' అంటూ చేసారు.

ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో కూడా అలాంటి ప్రయోగం రిపీట్ చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ రష్మిక తల్లిగా నిన్నటి తరం హీరోయిన్ సంగీత నటిస్తున్నారు. ఆ ఫ్యామిలీలో ఈ ఊతపదం వినిపిస్తుందని తెలుస్తోంది. ఊతపదం ఏమిటో తెలిసినా, ఇప్పటి నుంచి చెప్పేస్తే కిక్ పోతుందని తెలియ చేయడంలేదు.

సినిమాలో ఎమోషన్లు క్యారీ చేయడానికి విజయశాంతి క్యారెక్టర్ తో సీన్లను, ఫన్ క్యారీ చేయడానికి సంగీత ఫ్యామిలీతో సీన్లను అనిల్ రావిపూడి వాడుకున్నట్లు తెలుస్తోంది. 

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

Show comments

Related Stories :