అజయ్ భూపతి మల్టీస్టారర్ లో రామ్?

ఆర్ఎక్స్ 100 తో ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు అజయ్ భూపతి. తరువాత సినిమా ఏంటీ? అన్నది కాస్త ఆసక్తికరమే. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న అజయ్ భూపతి ఇప్పుడే కాస్త తీరుబాటు చిక్కి, తన తరువాత ప్రాజెక్టు మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈసారి అజయ్ భూపతి మల్టీ స్టారర్ సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం యంగ్ స్టార్ రామ్, మలయాళ యూత్ స్టార్ దుల్కర్ సల్మాన్ లను తీసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా. రామ్ నుంచి ఇప్పటికే ఓకె వచ్చేసిందట. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. 

కథ మొత్తం చెబితే, క్యారెక్టర్ నచ్చితే చేస్తానని హామీ ఇచ్చాడట దుల్కర్. అజయ్ భూపతి కనుక ఆ విషయంలో విజయం సాధిస్తే, మల్టీస్టారర్ పని మొదలయినట్లే. ఇంతకీ ఈ ప్రాజెక్టుకు నిర్మాత ఎవరో? స్రవంతి రవికిషర్ నా? వేరే వాళ్లా? తెలియాల్సి వుంది.