సుడిగాలి సుధీర్ బెటర్ కదా

టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్లలో ఈ మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. సినిమా బాగుండడం లేదా బాగా లేకపోవడం వేరు. కానీ ఓపెనింగ్ అన్నది కీలకం. దానిని బట్టే హీరోలకు సినిమాలు, రెమ్యూనిరేషన్లు వుంటాయి. 

ఓపెనింగ్ ను బట్టే సినిమాల అమ్మకాలు వుంటాయి. ఈ మధ్య కాలంలో చాలా చిన్న, మీడియం సినిమాలు వచ్చాయి. సుదీర్ బాబు, విష్వక్ సేన్, అల్లరి నరేష్, అల్లు శిరీష్, మంచు విష్ణు, ఇలా చాలా అంటే చాలా మంది సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఓపెనింగ్ కోసం వెదుక్కోవాల్సి వచ్చింది.

కానీ అస్సలు ఏ బ్యాకింగ్ లేదు. కొత్త నిర్మాతలు..అయినా సినిమాను ఎదురు వచ్చి కొన్నారు. 36 లక్షలకు బేరం జ‌రిగిన ఉత్తరాంధ్రలో పోటీ వచ్చి 40 లక్షలకు కొన్నారు. ఇదీ సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ సినిమా వ్యవహారం మాంచి ఓపెనింగ్ వచ్చింది. అలా అని గొప్ప సినిమా ఏమీ కాదు. కానీ ఉత్తరాంధ్రలో 70 లక్షలకు పైగా వసూలు చేస్తోంది.

ఇకనైనా ఈ హీరోయిజం ల వెనుక నిర్మాతలు పరుగెత్తుకుండా సోషల్ మీడియా మీద దృష్టి పెట్టాలి. ఎవరికి ఏ మేరకు క్రేజ్ వుందో తెలుసుకోవాలి. అప్పుడు సినిమా చేస్తే బెటర్. ఇప్పుడు గాలోడు చెబుతున్న సంగతి ఇదే. ప్రజ‌ల్లో లేకుండా నెత్తిన రుద్దితే సుఖం లేదు.

Show comments