ఈ సినిమా కోసం పైసా తీసుకోలేదు

ఈనెల 11న విడుదలకానున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాను కేవలం కథను నమ్మి చేశానని అంటున్నాడు రానా. తేజ ట్రాక్ రికార్డు చూస్తే ఈ సినిమా ఎవరూ చేయరని, కానీ తను తేజ ట్రాక్ రికార్డు కంటే జోగేంద్ర క్యారెక్టర్ చూశానని అంటున్నాడు. 

"ఈ సినిమాలో సరికొత్త రానాను చూస్తారు. ఎందుకంటే ఇందులో సిక్స్ ప్యాక్ కనిపిస్తుంది. బక్కగా ఉండే గెటప్ కూడా ఉంది. ఈ రెండింటితో పాటు కాస్త లావుగా ఉండే గెటప్ కూడా ఉంది. ఇలా బాడీలో వేరియేషన్స్ తో పాటు కాస్త నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టే ఈ సినిమా చేశాను". ఈ సినిమా ఎందుకు చేశారనే ప్రశ్నకు రానా సమాధానమిది.

పెద్ద ఎన్టీఆర్, ఎంజీఆర్ ఆలోచనలు, భావాలు ఈ సినిమాలో కనిపిస్తాయన్న రానా, ఫస్ట్ టైం డబ్బు తీసుకోకుండా ఈ సినిమాకు పనిచేశానంటున్నాడు. ఎందుకంటే ఇది తన తండ్రి సినిమా కాబట్టి ఫ్రీగా చేశానని, దీనికి కూడా పారితోషికం అడిగితే ఇంట్లో అన్నం పెట్టరని అన్నాడు. 

సినిమా ప్రమోషన్ లో భాగంగా యువగర్జన పేరిట వినూత్నంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దగ్గుబాటి ఫ్యాన్స్ ను కుటుంబ సమేతంగా దీనికి ఆహ్వానించారు. త్వరలోనే యూత్ కోసం మరో కార్యక్రమం పెడతానంటున్నాడు రానా.

Show comments