విలన్ వ్యవహారంపై పవన్ ఆగ్రహం?

మంత్రి మల్లారెడ్డి వున్నట్లుండి నిన్నటికి నిన్న ఓ బాంబ్ పేల్చారు. దర్శకుడు హరీష్ శంకర్ వచ్చి తనను పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని కోరారని ఆయన వెల్లడించారు. గంటర్నర బతిమాలినా తను అంగీకరించలేదని చెప్పారు. సరే, మంత్రి అయితే ఇలాంటి విషయంలో అబద్దం చెప్పరనే అనుకోవాలి. కానీ ఇక్కడ ఈ వ్యవహారం ఎలా వున్నా, అక్కడ పవన్ దగ్గర మాత్రం కాస్త నెగిటివ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు చెప్పకుండా చేయకుండా, విలన్ గా ఓ కొత్త వ్యక్తిని అది కూడా పొలిటీషియన్ ను సంప్రదించడం ఏమిటని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ రాజ‌కీయాల్లో వున్నారు. లేదూ అంటే ఇదేమీ పెద్ద సమస్య కాదు. 

మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో వున్నారు. అది హార్ట్ కోర్ యాంటీ భాజ‌పా పార్టీ. పవన్ అదే భాజ‌పాకు మద్దతు దారుగా వున్నారు. అదీ కాక తెలంగాణ పొలిటీషన్ విలన్..ఆంధ్ర పొలిటీషియన్ హీరో అనే వ్యవహారం అనవసరపు తలనొప్పలు తెచ్చే ప్రమాదం వుంది.

ఇలాంటివి ఏవీ ఆలోచించకుండా నేరుగా వెళ్లిపోయి అడిగేయడం ఏమిటి అన్నది పవన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఒకరిద్దరి దగ్గర కమెడియన్ సునీల్ ను విలన్ గా తీసుకుంటే ఎలా వుంటుందన్నది డిస్కస్ జ‌రిగినట్లు, ఈ మేరకు ఓ గెటప్ తయారు చేసి చూపించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదని హరీష్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అసలే మాళవిక మోహనన్ పేరు ముందుగా బయటకు వచ్చి, రివర్స్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ పూజా హెగ్డే ను బతిమాలుకోవాల్సి వస్తోంది. ఇక విలన్ సంగతి ఎన్ని టర్నింగ్ లు ఇచ్చుకుంటుందో?

Show comments