అప్పు రూపాయి పెంచను అని చెప్పు బాబూ!

చంద్రబాబు పడికట్టు పదజాలం ఒకటి వుంది… సంపద సృష్టిస్తా.. సంక్షేమం అమలు చేస్తా… ఇదే డైలాగు. ఇదే ప్రచారం. జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు. తానైతే సంపద సృష్టించి, సంక్షేమం అమలు చేస్తా అంటారు.

సిసిఎస్ రద్దు హామీ ని జగన్ తుంగలో తొక్కాడు. ఇది కూడా బాబు తరచు మాట్లాడే మాట. 

ఇప్పుడు చంద్రబాబు అధికారికంగా, స్పష్టంగా రెండు విషయాలు ప్రకటించవచ్చు కదా.

ఒకటి తాను అధికారంలోకి వస్తే సిసిఎస్ విషయంలో ఏం చేయదలుచుకున్నారు అన్నది క్లారిటీగా చెప్పాలి.

Readmore!

రెండవది. తాను అధికారంలోకి వస్తే, ఆనాటికి వున్న అప్పులను రూపాయి కూడా పెంచను అన్నది. అప్పటికి వున్న అప్పు ఇంత అని ప్రకటించి, దాన్ని మరింత పెరగనివ్వనని క్లారిటీ ఇవ్వాలి.

లిక్కర్ విషయంలో క్లారిటీగా క్వాలిటీ మందు ఇస్తామని చెబుతున్న బాబు,  సిసిఎస్ విషయంలోనూ, అప్పుల విషయంలోనూ ఎందుకు చెప్పరు?

Show comments