సర్వ సైన్యాధ్యక్షుడుగా రెడ్డి గారు

ఆయన పార్టీలో నంబర్ టూ అంటే చాలా మంది కాదు జగన్ కి ఆయనతో చెడింది అని ఈ  రోజు దాకా ప్రచారం చేస్తూ వచ్చారు. ఆయన ఇక పలాయనమ చిత్త‌గించాలని కూడా అన్నారు. ఆయనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 

ఆయన ఇప్పటికే వైసీపీలో అనేక కీలక పదవులలో ఉన్నారు. అయితే ఆయనకు ఈసారి రాజ్య సభ సీటు రెన్యూవల్ కాదని, అలాగే ఆయన విశాఖ నుంచి తట్టా బుట్టా సర్దుకుంటారని కూడా విపరీతమైన ప్రచారం జరిగింది.

ఆయనంటే గిట్టని వారు ప్రత్యర్ధులు ఈ రకమైన ప్రచారం చేసినా విజయసాయిరెడ్డి ప్లేస్ ఏంటో, వైసీపీలో ఆయన పొజిషన్ ఏంటో మరో మారు రుజువు అయింది. ఇప్పటికే ఉత్తరాంధ్రా వంటి అతి ముఖ్యమైన రీజియన్ కి వైసీపీ ఇంచార్జిగా విజయసాయిరెడ్డిని నియమించిన జగన్ ఇపుడు మరిన్ని కొత్త బాధ్యతలను కూడా విజయసాయిరెడ్డికే అప్పగించారు.

వైసీపీ అనుబంధ విభాగాలకు సంబంధించి మొత్తం అన్నీ విజయసాయిరెడ్డి ఇక మీదట చూస్తారన్న మాట. వాటికి ఇంచార్జిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో వైసీపీ నంబర్ టూ స్థానం ఎప్పటికీ ఆయనదేనని వైసీపీ క్యాడర్ సహా లీడర్లు అంతా అంటున్నారు.

మరో వైపు తనకు అప్పగించిన అదనపు బాధ్యతల పట్ల విజయసాయిరెడ్డి జగన్ కి ధన్యవాదాలు తెలియచేసారు. తాను శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీ అభివృద్ధికి పాటుపడతాను అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  

విశాఖకు విజయసాయిరెడ్డి టాటా అంటూ ఇక మీదట ప్రత్యర్ధుల ప్రచారాలు ఏవీ జరగబోవని అంతా ఆశిస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి వైసీపీలో ఎలాంటి కీ రోల్ అన్నది చేతల ద్వారానే రుజువు అయింది అంటున్నారు.

Show comments