వారికి అరవీర భయంకరుడు విజయసాయిరెడ్డి!

విజయసాయిరెడ్డి. వైసీపీ ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జి. రాబోయే కాలంలో కాబోతున్న విశాఖ‌ రాజధానికి అతి పెద్ద కాపలదారుగా ఇపుడు అవతరించారు. అమరావతిలో జరిగిన పాపాలు విశాఖలో ఎక్కడా చోటు చేసుకోకూడదన్న జగన్ సంకల్పాన్ని ఆచరణలో నిజం చేసి చూపిస్తున్న నాయకుడు.

విశాఖలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎపుడో గజం లక్ష రూపాయలు దాటిపోయింది. ఇపుడు రాజధాని రాకతో అది రెండింతలు, మూడింతలుగా పెరిగిపోతోంది. దాంతో పాటే కబ్జాదారులు కూడా తెగ రెచ్చిపోతున్నారు. గజానికో గాంధారీపుత్రుడు మాదిరిగా విశాఖలో వీరవిహారం చేస్తున్నారు.

అలాంటి వారందరికీ కంట్లో నలుసుగా విజయసాయిరెడ్డి మారిపోయారు. దందా చేస్తున్నాడు అన్న విషయం తెలియగానే తన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అని కూడా చూడకుండా కొయ్య ప్రసాదరెడ్డిని జగన్ తో చెప్పించి మరీ సస్పెండ్ చేయించారు.

ఇక విశాఖలో బీచ్ రోడ్డులో అతి ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం స్థలాన్ని కబ్జా చేయాలని గట్టిగానే స్కెచ్ వేసుకున్న ఓ కబ్జాదారుడికి విజయసాయిరెడ్డి ఇచ్చిన షాక్ అలా ఇలా కాదు. టీడీపీ హయాం నుంచీ ఇక్కడ కోట్ల విలువైన జాగా కొట్టేయాలని చూస్తున్న సదరు తమ్ముడి భూ భాగోతంపైన విజయసాయిరెడ్డి మూడే కన్నే తెరిచారు.

ఇదే తీరున  భూకామందుల కట్టలు తెంచుకున్న దాహానికి అడ్డుకట్ట వేస్తూ పెద్ద ఆనకట్టనే విజయసాయిరెడ్డి కట్టేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహరాంలో ఇటు స్వపక్షంతో పాటు అటు విపక్షం సైతం విజయసాయిరెడ్డి అరవీర భయంకర రూపాన్ని చూసి హడలిపోతున్నాయి.

విశాఖలో  ఇప్పటికే ప్రభుత్వ భూముల కొరత ఉంది. దానికి తోడు  కబ్దాలు చేస్తున్న పాతకుల పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాజధాని వచ్చినా ఇబ్బందులు తప్పవన్న ముందు జాగ్రత్తతోనే విజయసాయిరెడ్డి ఈ రకంగా చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి చేస్తున్న చర్యలతో నగరంలో మేధావులు, తటస్థులైన ప్రజానీకం మన్ననలు అందుకుంటున్నారు. శభాష్ విజయసాయిరెడ్డి అని అంతా అంటున్నారంటే ఆయన అంకితభావం మెచ్చతగినదే కదా.

ఇదీ జగన్ విజన్

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే

Show comments