ఒక కన్ను విశాఖ..మరో కన్ను అమరావతి...!

విశాఖ రాజధాని విషయంలో తమ్ముళ్ళకు పెద్ద చిక్కే వచ్చిపడిందిగా. అవునంటే బాబుకు కోపం. కాదంటే ఉన్న చోటనే ఉనికి పోతుంది. ఓటేసి గెలిపించిన జనం నిరసన జ్వాలలు తట్టుకోవడం కష్టం.

మరి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విశాఖ అర్బన్ జిల్లా  టీడీపీ ప్రెసిడెంట్ గా అనుభవం బాగానే సంపాదించిన వాసుపిల్లి గణేష్ కుమార్ దీనికి తనదైన శైలిలో తరుణోపాయం కనిపెట్టారులా ఉంది.

ఆయనలో ఇద్దరు మనుషులను బయటకు తెచ్చారు. ఒకరు విశాఖ వాసి.ఆయనకు విశాఖ పరిపాలనా రాజధాని కావడమంటే  ఇష్టమేనంట. అందుకు స్వాగతిస్తున్నారు. మరో మనిషి పూర్తిగా అధినేత చంద్రబాబుకు  బద్ధుడన్నమాట. ఆయన టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ హోదాలో బాబు చెప్పినట్లుగా అమరావతి రాజధానికే జై కొడుతూ  మద్దతు ఇస్తాడట.

ఇలా అపరిచితుడి టైపులో తనలో ఇద్దరు ఉన్నారంటూ చెప్పుకోవడం ద్వారా వాసుపిల్లి గోడమీద పిల్లి వాటాన్నే ప్రదర్శిస్తున్నారని కామెంట్స్ పడుతున్నాయి.  అవన్నీ సరే కానీ ఒక ఎమ్మెల్యేగా, నగర పౌరుడిగా ఆయనకు ఒకే ఓటు ఉంటుందని మరచినట్లున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

చూడబోతే ఇదేదో బాబు గారి రెండు కళ్ల సిధ్ధాంతంగాలాగే ఉందిగా.  విశాఖను వద్దనకుండా అమరావతిని ముద్దంటున్న వాసుపల్లి రాజకీయం మిగిలిన తమ్ముళ్లకు ఆదర్శమేనా. ఇంతకీ బాబుకు మూడు రాజధానుల విషయంలో ఎన్ని కళ్ళో మరి.

మెగా రెమ్యూనిరేషన్?

కర్నూలు వైరస్ కథ

Show comments