భలే కవర్ చేశావ్ 'మహర్షి'!

మొన్నటికిమొన్న దర్శకుడు క్రిష్ పై అద్భుతమైన ఫీలర్. అతడి కెరీర్ లో కథానాయకుడు సినిమా మాయని మచ్చలా నిలిచిపోతుందనే భయంతో ఏకంగా 5 కోట్ల రూపాయల బోనస్ అంటూ ఫీలర్లు వదిలారు. ఓవైపు 20 కోట్లు నష్టం వస్తుంటే దర్శకుడికి ఎవరైనా 5 కోట్లు బోనస్ ఇస్తారా? సరే ఈ విషయాన్ని పక్కనపెడితే, ఇప్పుడిలాంటిదే మరో "కవరింగ్ బాగోతం" బయటకొచ్చింది. ఈసారి మహర్షి వంతు.

చెప్పిన తేదీకి రాలేకపోతున్న మహర్షి సినిమా ఎందుకు వాయిదా పడిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. వంశీ పైడిపల్లి చెక్కుడు కారణంగానే అనుకున్న తేదీకి మహర్షి రావడం లేదనేది బహిరంగ రహస్యం. కానీ ఇప్పుడు దీన్ని తనదైన శైలిలో కవర్ చేస్తోంది దిల్ రాజు కోటరీ.

ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్లలోకి వచ్చేకంటే, ఆఖరి వారంలో వస్తేనే సెంటిమెంట్ పరంగా మహేష్ కు చాలా మంచిదట. దీనికి ఆ వర్గం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతోంది. పోకిరి, భరత్ అనే నేను సినిమాలు ఏప్రిల్ నెలాఖరులోనే థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్స్ హిట్ అయ్యాయి.

సో.. మహర్షిని కూడా ఏప్రిల్ 5న కాకుండా.. 26న థియేటర్లలోకి తీసుకొస్తారట. సినిమా వాయిదాకు ఇదే మెయిన్ రీజన్ అంటున్నారు. ఇప్పటివరకు వీళ్లు చెప్పిన లాజిక్ బాగానే ఉంది. ఒకవేళ ఏప్రిల్ నెలాఖరుకు కూడా వంశీ పైడిపల్లి సినిమాను సిద్ధం చేయకపోతే అప్పుడు ఏ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొస్తారో?

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

Show comments