టక్ జగదీష్ కు కరోనా ఎఫెక్ట్

కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రారంభమైన సినిమాల్లో టక్ జగదీష్ ఒకటి. నాని హీరోగా సాహు గారపాటి నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూట్ ఇప్పుడు మళ్లీ ఆగిపోయింది. కారణం మరేమీ కాదు. యూనిట్ లో కీలకమైన టెక్నీషియన్లు ఒకరిద్దరికి కరోనా సోకడమే. 

దీంతో షూట్ ను ఆపేసారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, శానిటైజేషన్ వంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ వున్నా, ముందుగా యూనిట్ సభ్యులు అందరికీ పరిక్షలు చేయించి, ఆపై షూటింగ్ స్టార్ట్ చేస్తున్నా ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. అందుకే మెగాస్టార్, వెంకటేష్ లాంటి సీనియర్లు ఇప్పట్లో షూటింగ్ లకు వచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసారు. 

రాజశేఖర్ ఫ్యామిలీకి

ఇదిలావుంటే హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా ధృవీకరించారు. తమ కుమార్తెలు ఇద్దరూ బాగానే వున్నారని, తాను, జీవిత కూడా రికవరీ అవుతున్నామని ఆయన వెల్లడించారు.

Show comments