టాలీవుడ్ కు శుభవార్త

సంక్రాంతి సినిమాలు టాలీవుడ్ లో జోష్ ను నింపాయి. ఈ జోష్ మరింత రెట్టింపయ్యే వార్త ను కేంద్రం ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి థియేటర్ల ఆక్యుపెన్సీ లిమిట్ ను పెంచబోతున్నట్లు ప్రకటించింది.

అయితే అలా అని 100 పర్సంట్ ఆక్యుపెన్సీ కాదు. మరి ఎలా? ఏ మేరకు పెంచుతారు?అన్నది త్వరలో ప్రకటిస్తారు.అంటే ఫిబ్రవరి 1 తరవాత విడుదలయ్యే సినిమాలు అన్నీ హ్యాపీగా 60 నుంచి 75శాతం ఆక్యుపెన్సీని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

అంతే కాదు, పరిస్థితి గమనిస్తుంటే మార్చి 1 నుంచి లేదా ఏప్రిల్ 1 నుంచి నూరు శాతం ఆక్యుపెన్సీ రావడం పక్కా అని నమ్మకం కలుగుతోంది. ఫిబ్రవరిలో మరీ ఎక్కువ సినిమాలు లేవు కానీ మార్చి నుంచి వరుసగా చాలా సినిమాలు వున్నాయి

ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారీ సినిమాల ప్లానింగ్ లో వున్నాయి. అందువల్ల ఇక ఈ అన్ని సినిమాలు చకచకా ఫినిష్ చేసుకుని విడదులకు రెడీ అయిపోయేలా చేస్తోందీ శుభవార్త.

థియేటర్లకు ఇంకా కష్టం

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

Show comments