మరో బంపర్ ఆఫర్ అందుకున్న తమన్

ఓ పెద్ద సినిమా వస్తుందంటే చాలు, మ్యూజిక్ కోసం తమన్ వైపు చూసే పరిస్థితి. ఫస్ట్ ఆప్షన్ తమన్, అతడు బిజీ అయితే అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వైపు చూద్దాం అనే ఫీలింగ్ కు వచ్చేశారు పెద్ద హీరోలు. 

ఈ క్రమంలో మరో క్రేజీ ఆఫర్ అందుకున్నాడు తమన్. చిరంజీవి లూసిఫర్ రీమేక్ కు మ్యూజిక్ అందించే అవకాశం కూడా ఇతడ్నే వరించింది.

మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ ను చిరంజీవి ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు సంబంధించి ఆల్రెడీ కాస్టింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది. 

నయనతార, సత్యదేవ్ లాంటి వాళ్లను తీసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరక్టర్ గా తమన్ ను సెలక్ట్ చేశారు. లూసిఫర్ కు సంగీతం అందించే అవకాశం తనకు వచ్చిన విషయాన్ని తమన్ స్వయంగా బయటపెట్టాడు.

ప్రస్తుతం తమన్ చేతిలో ఉన్నవన్నీ పెద్ద సినిమాలే. పవన్ హీరోగా రాబోతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు తమనే సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు సర్కారువారి పాట, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలు కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి. 

ఇప్పుడు లూసిఫర్ రీమేక్ కు కూడా సంగీతం అందించే అవకాశం తమన్ నే వరించింది. చిరంజీవి సినిమాకు సంగీతం అందించడం తమన్ కు ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యూజిక్ డైరక్టర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

చిరంజీవి సినిమాకు సంగీతం అందించడం అనేది ఏ కంపోజర్ కైనా ఓ కల అంటున్నాడు. 

కామెడీ ఒక్కటే కాదు నాకు సీరియస్ రోల్స్ చాలా ఇష్టం

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

Show comments