ఈ హీరోయిన్.. ఇండియాలో షాపింగ్ చేయనే చేయదట!

తనో పబ్లిక్ ఫిగర్ అని.. తను ఏదైనా మాల్ కు వెళ్లి బట్టలు కొనడం కష్ట సాధ్యం అని అంటోంది తాప్సీ. తను ఒక సెలబ్రిటీ కావడంతో.. ఏదైనా మాల్ కు వెళ్లి షాపింగ్ చేయాలంటే తెగ ఇబ్బంది పడాల్సి ఉంటుందని, జనాలంతా చుట్టుకునేస్తారంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. అందుకే తను  చాలా కాలంగా ఇండియాలో షాపింగే చేయడం లేదని.. తన షాపింగ్ అంతా విదేశాల్లోనే సాగుతోందని తాప్సీ చెప్పుకొచ్చింది!

ఒక పబ్లిక్ ఫిగర్ కావడం వల్లనే తను షాపింగ్ ఇక్కడ చేయలేకపోతున్నట్టుగా వివరించింది.  అయితే మాల్స్ కు వెళ్లి కొత్త కొత్త బట్టలు, ఇతర అవసరమైనవి కొనుగోలు చేయడం అంటే తనకు  ఎనలేని ఆసక్తి అని తాప్సీ చెప్పింది. తమ ఫ్యామిలీలో తనే మొదటి పబ్లిక్ ఫిగర్ అని తాప్సీ వివరించింది. 

తాప్సీ చెప్పింది ప్రాక్టికల్ గానే ఉన్నా, ఒకింత డబ్బా కొట్టుకుంటున్నట్టుగా కూడా ఉంది. కొంతమంది సెలబ్రిటీలు జనసామాన్యం మధ్యకు వచ్చి అప్పుడప్పుడు షాపింగ్ గట్రా చేసుకుంటూ ఉంటారు. యంగ్ హీరోయిన్లకు మాత్రం అలాంటి ఛాన్సులు  ఉండవు. మరీ హై ప్రొఫైల్  మనుషుల మధ్యనే వారు షాపింగ్ లు చేసుకోవాల్సి ఉంటుంది.   తాప్సీ మాత్రం.. తను ఇండియాలోనే కొనడం లేదని, షాపింగ్ అంతా ఫారెన్ లోనే అంటోంది!