సైరా.. మొత్తం దాచేసారు

మెగాస్టార్ మెగా మూవీ సైరా ట్రయిలర్ వచ్చింది. మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే సైరా సినిమాలో పాత్రలు, విషయం మాత్రం ట్రయిలర్ లో పరిచయం చేసినట్లు కనిపిస్తోంది. కీలకమైన అసలు విషయాలు అన్నీ అలాగే దాచారు.  సినిమా ప్రారంభం కావడమే అనుష్క మీద ప్రారంభమవుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయిగా ఆమె కనిపిస్తుంది.

అలాగే సినిమాలో కీలకమైన అండర్ వాటర్ సీన్, అలాగే నదిలో పడవల సీన్ ఈ రెండూ ట్రయిలర్ లో టచ్ చేయలేదు. అలాగే ఉయ్యాలవాడ ఫ్యామిలీలో నడిచే సరదా, ఇంకా ఎమోషనల్ సీన్లు పెద్దగా రివీల్ చేయలేదు. పాటలు టచ్ చేయలేదు.

ట్రయిలర్ ను కేవలం జోనర్, స్టోరీ, పాత్రలు పరిచయం చేయడానికి మాత్రమే వాడుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల యూనిట్ బహుశా రెండు ప్రయోజనాలు ఆశించి వుండోచ్చు. సినిమా మీద మరీ ఎక్కువ క్రేజ్ పెంచేయకుండా వుండడం, అలాగే ట్రయిలర్ లో కన్నా ఎక్కువ కంటెంట్ సినిమాలో కనిపిస్తే, వచ్చే టాక్ మరింత పాజిటివ్ గా వుంటుందని భావించడం.

మొత్తంమీద సైరా ట్రయిలర్ ఓ శాంపిల్ మాత్రమే. అసలు సినిమా ఎంతో వుంది. 

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!