జగన్ భరోసాతో ఉక్కు ధైర్యం

విశాఖ ఉక్కు కర్మాగారం ఇపుడు రాజకీయ జీవులకు ఆలవాలమైంది. ఆ పేరిట నానా యాగీ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్న వారున్నారు. విశాఖ ప్రైవేటీకరణ మీద పోరు చేయకుండా సొంత రాజకీయానికి తెర తీస్తున్న పార్టీలూ ఉన్నాయి.

ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ వచ్చి వెళ్లిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. ఆయన ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలతో భేటీ అవడమే కాదు, వారు చెప్పిన దాన్ని సానుకూలంగా విన్నారు. 

విశాఖ ఉక్కు పరిశ్రమని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమంటూ జగన్ ఇచ్చిన ఒక్క మాటతో మొత్తం విశాఖ కార్మిక లోకానికి అతి పెద్ద భరోసా  లభించినట్లు అయింది.  దానికి ముందు విశాఖకు వచ్చిన చంద్రబాబు జగనే ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తునారు, ఆయన భూములు ఆక్రమించుకుంటాడు అంటూ చేసిన ఆరోపణలు అలా దూదిపింజల్లా తేలిపోయాయి.

ఉక్కు జేఏసీ నాయకులు మాట్లాడుతూ జగన్ మీద తమకు నమ్మకం ఉందని ప్రకటించారు. ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం అని కార్మిక నాయకులే నేరుగా చెప్పడంతో ఉక్కు సాక్షిగా తుక్కు రాజకీయాలకు సాగరతీరంలోకి కొట్టుకుపోయాయి. 

మొత్తానికి జగన్ ఇచ్చిన మాట నెరవేరుస్తారు అన్న నమ్మకంతో కార్మికులు ధీమాగా ఉన్నారు. కేవలం ఇరవై నాలుగు గంటల్లో వచ్చిన మార్పు ఇది. నిన్నంతా విశాఖకు  ఉక్కు ఇక దక్కదు అంటూ తమ్ముళ్ళు వేసిన చిందులకు చాలా సైలెంట్ గా జగన్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఇది.

షీ హేజ్ టు గో ఎ లాంగ్ వే

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

Show comments