సిరివెన్నెల.. శభాషైన సాహిత్యం

ఇటీవల మళ్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు టాలీవుడ్ లో పయనిస్తోంది. పీరియాడిక్ మూవీస్, రీమిక్స్ లో, ఓల్డ్ సాంగ్స్ టైపు మ్యూజిక్ లు ఇలా అన్నీ. ఏదో పేరు చెప్పి పాతను, పాత స్టయిల్ ను గుర్తు చేస్తున్నారు. ఆ మధ్య, శతమానం భవతి,  పలాస సినిమాల్లో ఎస్పీబాలు ఓల్డ్ టైపు సాంగ్స్ పాడారు. ఇప్పుడు మళ్లీ ఆయనే అలాంటి పాట మరోటి ఆలపించారు.

రవితేజ-విఐ ఆనంద్ కాంబినేషన్ లో తయారవుతున్న డిస్కోరాజా సినిమాలో ఎనభైల కాలం నాటి పాట ఒకటి వుంది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అందులో ఒకటి 80ల కాలం నాటి లుక్. బహుశా అందుకోసం కావచ్చు. ఇలాంటి పాట ఒకటి తయారుచేసారు.

''...నువ్వు నాతోం ఏమన్నావో..
నేనేం విన్నానో..
బదులు ఏదో ఏం చెప్పావో.. 
ఏమనుకున్నానో..
భాషంటూ అంటూ లేని భావాలేవో ..
నీ చూపులో చదవనా?.. 
స్వరమంటూ లేని సంగీతాన్నై ..
నీ మనసునే తాకనా..
ఎటు సాగాలో అడగని ఈ గాలితో..ఎపుడాగలో తెలియని వేగాలతో..''
**
నీలాల నీ కనుపాపలో ఏ మేఘ సందేశమో...
ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే...
చిరునామా లేని లేఖంటి నా గానం....
చేరిందా నీకు ఇన్నాళ్లకు...
నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం..
తీర్చేసావేమో ఈనాటికి..
మౌన రాగాలు పలికే సరాగాలతో..
మందహాసాలు చిలికే పరాగాలతో.. 
నీ కురులలో నీ పరిమళం నన్నల్లుకోకుండగా..
నీ తనువులో ఈ పరవశం..
నను నేను మరిచేంతగా..
రెక్కల్లా మారి దేహాల సాయంతో..
దిక్కుల్ని దాటి విహరించుదాం..
రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలనెన్నో కనిపెంచుదాం..
మంచు తెరలన్ని కరిగించు ఆవిరులతో..
హాయిగా అలసిపోతున్న ఆహాలతో...

 

Show comments