శరత్ మురార్ ఇప్పుడు అక్కడ

శరత్ మురార్ నమ్మకానికి పెట్టిన పేరు. యువర్స్ మోస్ట్ ఒబీడియన్ ట్లీ అనే క్యారెక్టరైజేషన్. మాటీవీలో ప్రవేశించి, మంచి మార్కులు సంపాదించి, మెగా ఫ్యామిలీకి దగ్గరై, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి మిత్రుడిగా మారారు. రెండు సినిమాలు నిర్మించారు. ఒకదశలో పవన్ కు కళ్లు, చెవులు రెండూ శరత్ నే అన్నంత వరకు వచ్చింది. తెలుగుదేశం పార్లీ ముఖ్యులతో కూడా పవన్ తరపున శరత్ నే మాట్లాడేవారు.

ఇలాంటి నేపథ్యంలో ఎక్కడో తేడా వచ్చింది. మౌనంగా దూరం అయ్యారు. పవన్ కు శరత్ దూరంకావడం వెనుక పవర్ స్టార్ తో అనుబంధం వున్న ఓ పెద్దమనిషి హస్తం వుందని గుసగుసలు వున్నాయి. ఆ పెద్దాయిన చాలా తెలివిగా, స్మూత్ గా పవన్ ను శరత్ ను విడదీసారని ఇండస్ట్రీలో టాక్. ఏమైనా శరత్ మౌనంగా బయటకు వచ్చి తన మానాన డబ్బింగ్ సినిమాలు, డిజిటల్ మీడియా కంటెంట్ చేసుకుంటూ గడిపేస్తున్నారు.

లేటెస్ట్ విశేషం ఏమిటంటే, అదే శరత్ ఇప్పుడు మళ్లీ మెగా కాంపౌండ్ లో ప్రత్యక్షం అయ్యారన్నది. కొణిదెల ప్రొడక్షన్స్ లో శరత్ ఇప్పుడు ఆక్టివ్ గా వున్నారని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి విడుదల దగ్గరకు వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వున్నాయి. మార్కెటింగ్ పనులు వున్నాయి. పబ్లిసిటీ వ్యవహారాలు వున్నాయి. రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ వుండనే వున్నారు. అయినా కూడా శరత్ ను కూడా ఇప్పుడు రామ్ చరణ్ దగ్గరకు తీసినట్లు తెలుస్తోంది.

పలు వ్యవహారాలు ఇప్పుడు శరత్ కూడా చూస్తున్నారని తెలుస్తోంది. పవన్ కు దూరమైనా అరవింద్, మెగాస్టార్ ల గుడ్ లుక్స్ లోనే శరత్ వుంటూ వస్తున్నారు. బహుశా పవన్ కు కూడా ఎక్కడో పాత మిత్రుడి మీద సాఫ్ట్ కార్నర్ వుండి వుండొచ్చు. అందుకే మళ్లీ ఈ రూట్ లో దగ్గరకు తీస్తున్నారేమో?

తెలుగులో సినీప్రియుల రూటు మారింది

Show comments