సందీప్ ఇక కేరాఫ్ బాలీవుడ్

అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరక్టర్ సందీప్ వంగా, అంతకు మించిన సంచలనాన్ని బాలీవుడ్ లో పుట్టించాడు. విమర్శలు, ప్రశంసలు, కలెక్షన్లు ఇలా అన్నీకలిసి సందీప్ పేరును బాలీవుడ్ లో మారుమోగేలా చేసాయి. దీని ఫలితం కూడా కనిపిస్తోంది. బాలీవుడ్ లో అప్పుడే సందీప్ కోసం ఆఫర్లు లైన్ కడుతున్నాయని బోగట్టా.

ఒకరిద్దరు భారీ నిర్మాతలు వందకోట్ల రేంజ్ ప్యాకేజ్ లు ఆఫర్ చేస్తున్నారట. ఫస్ట్ కాపీ ఇవ్వండి, వంద కోట్లు తీసుకోండి అనే టైపు ఆఫర్లు ఇప్పుడు సందీప్ వంగా దగ్గర రెడీగా వున్నాయి. వాస్తవానికి సందీప్ వంగా కోసం సల్మాన్ ఖాన్ కూడా రెడీ అని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి.

అంతా బాగానే వుంది కానీ తెలుగులో మైత్రీమూవీస్, ఆసియన్ సునీల్ వంటి నిర్మాతలు సందీప్ వంగా బాలీవుడ్ సినిమా ఫినిష్ చేసి, తెలుగులోకి వస్తాడని ఎదురుచూస్తున్నారు. మహేష్ కు గతంలో లైన్ చెప్పాడు కానీ ఆయన దానిని ఓకె చేయలేదు.

ఈ నేపథ్యంలో మరి తెలుగులోకి వచ్చి, ఇక్కడ హీరోలకు తగినట్లు కథలు చెప్పడానికి ట్రయ్ చేస్తాడా? లేదా వందల కోట్ల ఆఫర్ల మేరకు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తాడా? అన్నది చూడాలి. వినిపిస్తున్న వార్తలు వాస్తవమైతే సందీప్ వంగా తరువాత సినిమా కూడా బాలీవుడ్ లోనే వుండబోతోందని తెలుస్తోంది.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?

Show comments