సామజవరగమన..ఫీమేల్ వెర్షన్?

మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు కనీసం అయిదారు సినిమాలు తెచ్చిపెట్టే రేంజ్ పాట. ఆదిత్య మ్యూజిక్ కు టోటల్ లాంగ్ రన్ లో కోటిన్నరకు పైగా తెస్తుందని లెక్కలు వేస్తున్నపాట. సిరివెన్నెల సున్నతమైన సాహిత్యానికి సిద్దూ శ్రీరామ్ గాత్రం తోడై చేసిన మ్యాజిక్. సామజవరగమన..నిను చూసి ఆగగలనా? పాట సంగతే ఇదంతా.

ఇప్పుడు ఈ పాటకు సరదాగా, ప్రమోషన్ సాంగ్ మాదిరిగా ఫీమేల్ వెర్షన్ తయారుచేసి విడుదల చేసే ఆలోచనలో వున్నారట సినిమా నిర్మాతలు. సినిమాలో మేల్ వాయిస్ తోటే వుంటుంది పాట. అయితే ఇదే పాట ఫిమేల్ వాయిస్ లో వుంటే ఎలా వుంటుంది? సినిమాకు ప్రచార పరంగా ఏ మేరకు ఉపయోగపడతుంది? అని లెక్కలు, ఆలోచనలు చేస్తున్నారు.

ట్రాక్ అంతా రెడీగా వుంటుంది కాబట్టి సింగర్ చార్జెస్ తప్ప పెద్దగా ఖర్చవదు. పైగా ఆ మాత్రం ఖర్చు డిజిటల్ మీడియా ద్వారా రికవరీ అయిపోతుంది. ఖర్చు సంగతి ఎలా వున్నా, సామజవరగమన పాట ఇప్పటికే 70 మిలియన్లకు పైగా హిట్ లు అందుకుంది. ఇప్పుడు సరైన ఫిమేల్ వాయిస్ సెట్ అయితే మరింత పాపులర్ అవుతుంది. 

Show comments