రవిబాబు వెటకారం మామూలుగా లేదుగా

'అల్లరి' రవిబాబు పందిపిల్ల సినిమా అదిగో. ఈ సినిమాను మొత్తానికి దసరాబరిలోకి దింపుతున్నట్లు ప్రకటిస్తూ, ట్రయిలర్ వదిలాడు. సరే, ఇప్పటికే కిక్కిరిసిపోయిన, దసరా బరిలోకి ఈ పందిపిల్ల సినిమా వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే, ట్రయిలర్ మాత్రం కాస్త సరదాగా వుంది. 

రవిబాబుకు కాస్త వెటకారం పాలు ఎక్కువే. అదంతా ట్రయిలర్ లో కనిపిస్తోంది. త్రీడీ, యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, భారీ సినిమా అంటూ క్యాప్షన్ లు వేసి, వాటికి తగిన సీన్లు పందిపిల్ల మీద కట్ చేసి, ఆసక్తికరంగానే తయారుచేసాడు ట్రయిలర్ ను. 

కానీ ఇప్పటికే ఇంటర్ నెట్ వాడకం, యూట్యూబ్ పుణ్యమా అని ఈ జనరేషన్ పిల్లలు ఇంతకన్నా సూపర్ యానిమేటెడ్ సినిమాలు, కార్ట్యూన్ మూవీలు, చాలా అంటే చాలా చూసేసారు. ఇది మన తెలుగులో మన దేశీ మూవీ అనుకోవాలి. ఇలాంటి సినిమాలు మనకు రాలేదు కాబట్టి, పిల్లలకు అదో సరదాగానే వుంటుంది.

మెయిన్ థియేటర్ల ఆదాయం సంగతి ఎలా వున్నా, అమెజాన్ వుండనే వుందిగా ఇలాంటి వాటికి ఫుల్ సపోర్టు ఇవ్వడానికి.