రఘు..రామ..రామ

జగన్ మీద అకారణ లేదా సకారణ ద్వేషం పెంచుకుని గత కొంతకాలంగా తెలుగుదేశం అను'కుల' మీడియాకు మాంచి కంటెంట్ ప్రొవైడర్ గా మారారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. అంతకు మించి ఆయన సాధించింది లేదు. పైగా ఎప్పుడయితే జగన్ కు దూరం అయ్యారో అప్పటి నుంచి ఆయన తన నియోజకవర్గానికి కూడా దూరం అయిపోయారు.

తనపై దాడి జరుగుతుంది అని లేదా కేసులు పెడతారని ఆయనకు ఆయనే భయపడిపోయారు. కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అలా సెక్యూరిటీ తెచ్చుకుని కూడా ఇప్పటి వరకు ఆంధ్రలో అడుగుపెట్టలేదు. ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. కానీ ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన తన నియోజకవర్గంలో తన జనాలకు కూడా దూరం అయిపోతున్నాను అని. 

నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. రఘురామకృష్ణం రాజు పట్ల కానీ, ఆయనకు వచ్చిన సమస్య గురించి కానీ ఆయన మద్దతుదారులకు లేదా ఆయన నియోజకవర్గ జనాలకు పట్టలేదని ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. 

భవిష్యత్ లో రాబోయే ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు ఇక వైకాపా టికెట్ మీద అయితే పోటీ చేయలేరు. అయితే భాజపా లేదా మరో పార్టీ తరపున పోటీ చేయాల్సిందే. మరి ఇప్పుడు వైకాపా విజయం కచ్చితంగా రఘురాముడిని కలవరపర్చే విషయమే. 

పాపం ఇకనైనా తన గ్రౌండ్ ను పటిష్టం చేసుకునేందుకు రఘురాముడు తన నియోజకవర్గంలో అడుగుపెడతారో? ఇక రాజకీయ భవిష్యత్ ను వదిలేసుకునేందుకే డిసైడ్ అయిపోతారో? చూడాలి. 

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం

దత్త పుత్రుడు , సొంత పుత్రుడు ఇప్పుడు ఎక్కడ

Show comments