మీతో ఏకీభవిస్తున్నాం..: పీవీపీ

విజయవాడ రాజకీయం అంతా నర్మగర్భంగా సాగుతూ ఉంది. తెలుగుదేశం నేతలు ఒకరి పేరు ఎత్తకుండా మరొకరు దారుణంగా కించపరుచుకుంటూ ఉన్నారు. ఇన్నాళ్లూ వాళ్ల మీద ప్రత్యర్థులు చేసిన ఆరోపణలనే ఇప్పుడు టీడీపీ నేతలు ఒకరి మీద మరొకు చేసుకుంటూ ఉన్నారు.

ఈ రచ్చలోకి నారా లోకేష్ నే లాగేశారు. రాయడం రాదు, మాట్లాడటం రాదు, చదవడం రాదు.. ట్విటర్ ఎక్కి రాజకీయం చేస్తున్నావా? అంటూ ఆఖరికి తెలుగుదేశం నేతలే నారాలోకేష్ ను ప్రశ్నించిన పరిస్థితి వచ్చింది. ఇక లోకేష్ ను అనేసరికే కొంతమంది స్పందించగా, వారిని శునకాలతో సంబోధించడం  తెలుగుదేశం పార్టీలో పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్. విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిన పీవీపీ ప్రస్తుత రాజకీయంపై ఘాటుగా స్పందించారు. ఫేస్ బుక్ లో ఈ మేరకు ఆయన ఒక పోస్టు పెట్టారు. అది యథాతథంగా ఇలా ఉంది.

"చట్టసభలలో బల్లలరిగేలా కూర్చుని
పిర్రలు పెంచడం కాదు... 
మిమల్ని ఎన్నుకున్న ప్రజలకు ఏమైనా చేసేది ఉందా లేక ట్విట్టెర్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తారా?? 
ఏదిఏమైనా మీ ఇద్దరు చేసుకున్న పరస్పర ఆరోపణలతో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకీభవిస్తునాము.
జైహింద్.." అంటూ పీవీపీ పోస్టుచేశాడు. ఇది ఎవరిని ఉద్దేశిందో అర్థం చేసుకోవడం మరీ అంత కష్టమైనది కాదు. అందుకే పీవీపీ కూడా పేర్లను ప్రస్తావించినట్టుగా లేరు. భుజాలు తడుముకునే వారే స్పందించాలి ఈ పోస్టు మీద!

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు

Show comments