పవన్ కు లేటుగా శుభాకాంక్షలు

పవన్ తో సినిమాలు నిర్మించే నిర్మాతలు వరుసపెట్టి ఆయనను కలవడం ప్రారంభించారు. కలిసి వస్తే ఫరవాలేదు. వచ్చి ఓ ఫ్రెస్ నోట్ ఇస్తున్నారు. తమ సినిమా అప్ డేట్ ఇది అంటూ..ఓ పిక్ కూడా జోడిస్తున్నారు. 

అసలు విషయం వేరు అన్నది అసలు సిసలు పాయింట్. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు జరిగింది. కానీ ఆ రోజున ఆయన నిర్మాతలు ఎవ్వరినీ కలవాడానికి అనుమతించలేదు. కేవలం తన 'ఆప్తులు' అయిన కొద్ది మందిని మాత్రమే కలిసారు.

ఇప్పుడు ఇక అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. అందుకే నిన్న ఒకరు, నేడు మరొకరు కలిసి శుభాకాంక్షలు ఆలస్యంగానైనా తెలిపి వచ్చారని తెలుస్తోంది. కానీ ఇదంతా బయటకు చెప్పుకునేది కాదు కదా? అందుకే తమ తమ సినిమాల అప్ డేట్ లు అంటూ వదుల్తున్నారు. కానీ నిజానికి వాటిల్లో అప్ డేట్క లు ఏవీ లేవు. పాత విషయాలే మరోసారి చెప్పడం తప్ప. 

పవన్ భీమ్లా నాయక్ షూట్ పూర్తి చేయాల్సి వుంది. ఏ ఆటంకమూ లేకపోతే అది ఈ అక్టోబర్ నెల తొలివారానికి పూర్తి అవుతుంది. ఆ తరువాతే హరి హర వీరమల్లు షూటింగ్. ఆ తరువాత మైత్రీ మూవీస్ సినిమా స్టార్ట్ అవుతుంది. 

Show comments