పవన్ సినిమాలో కేతికశర్మ

రొమాంటిక్ సినిమాతో కుర్రకారును ఆకట్టుకుంది కేతికశర్మ. ఆ సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఆ తరువాత సరైన సినిమా పడలేరు. 

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా సినిమా నిర్మాణంలో వుంది. ఈ సినిమా విడుదలయితే కేతిక డిమాండ్ పెరుగుతుందా? తరుగుతుందా? అన్నది తెలస్తుంది. కానీ ఈ లోగా సినిమాలు అయితే చేతిలోకి బాగానే వస్తున్నాయి.

లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా ఎంపికయింది. అయితే ఆయన సరసన హీరోయిన్ గా కాదు. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా. 

సముద్రఖని డైరక్షన్ లో పవన్ కళ్యాణ్..సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించే రీమేక్ సినిమాకు హీరోయిన్ అన్నమాట. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ వుండదు. ఆ పాత్ర  ప్రత్యేకం కదా.

ఈ సినిమా షూట్ వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. చకచకా నాలుగు నెలల్లో పూర్తి చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా మాత్రమే ఈ ఏడాది విడుదలకు అవకాశం వున్న పవన్ కళ్యాణ్ సినిమా అనుకోవచ్చు.

Show comments