పల్లెల సరదా తీర్చేస్తున్న జగన్

తెలిసి జరుగుతోందో, తెలియక జరుగుతోందో, అనివార్యమో తెలియదు కానీ ఉత్తరాంధ్ర పల్లెల సరదా తీర్చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కోరి ఎన్నుకున్నందుకు వేసవి వేళ పవర్ కట్ తో జనాల ప్రాణాలు తోడేస్తున్నారు. 

చంద్రబాబు రాకముందు పల్లెల్లో రోజుకు 12 గంటల పవర్ కట్ వుండేది. ఆయన వచ్చాక పవర్ కట్ అన్నది లేదు. 24 గంటల పవర్ ఇచ్చారు. జగన్ వచ్చాక కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇన్నాళ్లూ.

కానీ ఇప్పుడు మళ్లీ అంథకార యుగం మొదలయింది. పల్లెల్లో రోజుకు నాలుగు నుంచి అయిదు గంటలు పవర్ కట్ విధిస్తున్నారు. ఎండలు మండిపోతున్న వేళ్ల జగన్ పాలనను ఈ కారణంగా తిట్టుకోనివారు లేరు. 

ఎంత డబ్బులు అక్కౌంట్ లో పోసినా, కీలకమైన ఎండ వేళ రెండు న్నర గంటలు, రెండున్నర గంటల వంతున పవర్ కట్ విధిస్తుండడంతో జనం మండి పడుతున్నారు.

ఇదే తీరు ఇలా కొనసాగితే జగన్ పాలన మీద ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న ప్రచారానికి ఇది కూడా తోడవుతుంది. జనం పరోక్షంగా ఏ భారం, ఏ బాధ అయినా భరిస్తారు కానీ ప్రత్యక్షంగా అయితే ఇక అంతే సంగతులు. మరి ఇంతకీ కింది స్థాయిలో జరుగుతున్న ఈ వైనం జగన్ కు తెలుసో, తెలియదో?

Show comments