అక్టోబర్ 18న మీకు మాత్రమే చెప్తా

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న తొలిసినిమా 'మీకు మాత్రమే చెప్తా'. తనకు లైఫ్ అండ్ లిఫ్ట్ ఇచ్చిన పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ, నిర్మిస్తున్న సినిమా. ఈ సినిమాను అతి తక్కువ వ్యయంలో పూర్తిచేసి, అదే అమౌంట్ కు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ కు విక్రయించేసారు. నాన్ థియేటర్ రైట్స్ లాభాలుగా వుంచుకున్నారు.

ఈ సినిమాకు విడుదల డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 18న మీకు మాత్రమే చెప్తా సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆ టైమ్ లో ప్రస్తుతానికి అయితే అంతగా సినిమాలు లేవు. 24 నుంచి సినిమాలు వున్నాయి. ఈ సినిమా బడ్జెట్ కు, సేల్ ప్రయిస్ కు ఆ డేట్ బాగానే వుంటుందని అలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే టీజర్, ఫస్ట్ సాంగ్ వదిలారు. ఆ విధంగా సినిమా జోనర్ ఎలా వుండబోతోందో వెల్లడించారు. సాంగ్ కు అయితే అంత రెస్సాన్స్ వచ్చినట్లు లేదు. ఈ తరహా జోనర్ లు మాత్రం కొత్తగా వుంటున్నాయి కనుక బాగానే చూస్తున్నారు. అదే హోప్ తో అక్టోబర్ 18న విడుదలకు సిద్దం అవుతున్నట్లు బోగట్టా.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

Show comments