విశాఖ మీద టీడీపీకి మోజు పెరిగిందా?

విశాఖ మీద టీడీపీకి మోజు పెరిగిందా అన్న చర్చకు తెర లేస్తోంది. విశాఖ సహా ఉత్తరాంధ్రకు పదవులలో పెద్ద పీట వేయడం, విశాఖకు చెందిన వారికే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితను హోం మంత్రిగా అయ్యన్నపాత్రుడుని స్పీకర్ గా చేయడం వంటివి చూస్తూంటే విశాఖ విషయంలో టీడీపీ ఆలోచనలు ఆశలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి విశాఖ వచ్చిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని తొందరలోనే అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆ పధకాన్ని విశాఖలోనే ప్రారంభిస్తామని మంత్రి చెబుతున్నారు. విశాఖ నుంచే మహిళలు ఉచితంగా బస్సు ఎక్కేలా శ్రీకారం చుడతామని అంటున్నారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో అమలు అవుతున్న పధకాల తీరు తెన్నులను చూసిన మీదటనే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పధకం విధివిధానాలు ప్రకటిస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని మంత్రి అనడం విశేషం. ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ఆర్టీసీని ప్రక్షాణల చేస్తామని ఆయన అంటున్నారు. ప్రక్షాళన అంటే ఏమిటో మాత్రం చెప్పలేదు.

చంద్రబాబు తన మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని తాము అందుకే చురుకుగా పనిచేయగలుగుతున్నామని ఆయన అన్నారు. విశాఖలో తన తొలి అధికార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విశాఖ సెంటిమెంట్ అచ్చొస్తుందని అంటున్నారు. విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ 3వ సీజన్‌ ను రాంప్రసాద్‌రెడ్డి  ప్రారంభించారు Readmore!

Show comments