పోలవరంను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన వెంట‌నే ఆ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. శ్వేత‌ప‌త్రం విడుద‌ల టైం ఆయ‌న చెప్పిన‌ట్లు గానే అంత‌ర్జాతీయ నిపుణుల బృందం పోల‌వ‌రంలో దిగింది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. 

ఈ బృందం 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై అంతర్జాతీయ నిపుణులు నివేదిక ఇస్తారు. ఈ నివేదికను బట్టే పనులపై ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క‌మిటీలో అమెరికా, కెనడాలకు చెందిన‌ 4 గురు నిపుణులు ఉన్నారు. నిన్న కూడా ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో స‌మావేశం అయ్యారు. 

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంట‌నే సీఎంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వరదలకు దెబ్బ తిన్న రిటర్నింగ్‌ వాల్‌తోపాటు, కాఫర్‌ డ్యాం, గైండ్‌ బండ్‌ను పరిశీలించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పోలవరంను నాశనం చేసిందని విమర్శించారు. అనంతరం పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేశారు. తిరిగి ప్రాజెక్ట్‌ పనులను ఎలా ప్రారంభించాలి అనే దానిపై నిపుణుల బృందాన్ని నియమించారు.  

Readmore!
Show comments