త‌ప్పు నిమ్మ‌గ‌డ్డ‌, బాబుది.. క‌ష్టాలు పెన్ష‌న‌ర్స్‌కు!

వ‌లంటీర్లంటే వ‌ణికిపోతున్న కూట‌మి... చేయ‌కూడ‌ని త‌ప్పు చేసింది. వ‌లంటీర్ల‌తో సామాజిక పింఛ‌న్లు పంపిణీ చేయ‌కూడ‌దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ద్వారా ఫిర్యాదు చేయించింది. ఓట‌ర్ల‌ను వ‌లంటీర్లు ప్ర‌భావితం చేస్తార‌ని ఫిర్యాదు చేయ‌డంతో ఎన్నిక‌ల సంఘం తీవ్ర నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై వారితో ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేయ‌వ‌ద్ద‌ని సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది.

ఫిర్యాదు చేసిన నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్, ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ విజ‌యం సాధించామ‌ని తెగ సంబ‌ర‌ప‌డ్డారు. స‌చివాల‌యాల వ‌ద్ద‌కెళ్లి పింఛ‌న్లు తీసుకెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని, కూట‌మి నేత‌ల వ‌ల్లే త‌మ‌కు ఇబ్బందులొచ్చాయ‌ని 66 ల‌క్ష‌ల పింఛ‌న్‌దారులు తీవ్ర ఆవేద‌న చెందారు. వ‌డ‌దెబ్బ‌కు 33 మంది పెన్ష‌న్‌దారులు మృత్యువాత ప‌డ్డారు.

ఇప్పుడు మ‌ళ్లీ పెన్ష‌న‌ర్ల‌కు అవే ఇబ్బందులు త‌ప్పేలా లేవు. ఉద్యోగులంతా ఎన్నిక‌ల విధుల్లో త‌ల‌మున‌క‌లై వుండ‌డంతో సామాజిక పించ‌న్లు ప్ర‌తి ఇంటికీ వెళ్లి పంపిణీ చేయ‌లేమ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఏప్రిల్‌లో పంపిణీ చేసిన‌ట్టుగానే మే నెల పింఛ‌న్లు పంపిణీ చేస్తామ‌ని ఈసీకి ఆయ‌న తెలియ‌జేశారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల విధుల్లో ఉద్యోగులు బిజీగా ఉన్నార‌ని, ఇంటింటికి వెళ్లి సామాజిక పింఛ‌న్లు పంపిణీ చేసే ప‌రిస్థితి లేద‌ని ప్ర‌తిప‌క్షాల‌కు బాగా తెలుసు. అయిన‌ప్ప‌టికీ చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటున్న చందంగా ప్ర‌తిప‌క్షాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని గ‌గ్గోలు పెట్ట‌డం... వారి త‌ప్పుల్ని ప్ర‌తిబింబిస్తోంది. ఈ పాపం త‌మ‌కెక్క‌డ చుట్టుకుంటుందో అని వారంతా ఇప్పుడు భ‌య‌ప‌డి... రాద్ధాంతం చేస్తున్నారు. నిజంగా పింఛ‌న్‌దారుల‌పై ప్రేమాభిమానాలే వుంటే, వ‌లంటీర్ల‌తో పంపిణీని అడ్డుకునే వారు కాద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

Show comments