వైసీపీకి సానుకూల దిశగా వైజాగ్ స్టీల్ కార్మికులు!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రలో తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న విధానాల విషయంలో అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో ఉక్కు కార్మిక సంఘాల నేతలు కార్మికులు కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ముఖ్యమంత్రిని విశాఖపట్నంలో కలిసిన ఉక్కు కార్మిక సంఘం నేతలకు ముఖ్యమంత్రి కొన్ని స్పష్టమైన అంశాలను వారి దృష్టికి తీసుకువచ్చారు.

తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ లాభాపేక్షతోనే బిజెపితో కలిసింది తప్ప, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందా అని కార్మిక సంఘ నేతలను అడిగి తెలుసుకున్నారు .తాము తొలి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఈ అంశాన్ని అటు అసెంబ్లీలో తీర్మానించడం ద్వారా బయట కూడా నేరుగా ప్రధాని సమక్షంలో కూడా ఈ అంశాన్ని లేవనిత్తానని సీఎం ఉక్కు కార్మిక సంఘ నేతలకు వివరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ తమ వైఖరి స్పష్టం చేయాలని సీఎం జగన్ డిమాండ్ చేశారు.

టీడీపీ, బీజేపీవి ఎన్నికల కోసం పొత్తులు.. రాష్ట్ర ప్రయోజనాలపై పొలిటికల్ డ్రామాలు అని ఉక్కు కార్మిక సంఘ నేతల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

- విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకం అని.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కార్మిక సంఘం నాయకులకు అండగా ఉంటాం అని సీఎం హామీ ఇచ్చారు.

- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ సీపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలుస్తుంది.

- రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ సీపీ.స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున మొట్టమొదట గళమెత్తింది. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారాలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానికి లేఖ రాసింది.

- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ సీపీది రాజీలేని ధోరణి అని స్పష్టం చేసారు. 

ఇనుప ఖనిజం గనులను శాశ్వతంగా కేటాయించడం వల్ల ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు తాము శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని సీఎం జగన్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల మద్దతును కోరే నైతికత కేవలం వైఎస్ఆర్ సీపీకి మాత్రమే ఉందని, ఎందుకంటే మా పార్టీ మాత్రమే కార్మికులకు అండగా నిలిచిందన్నారు.

ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ రెండూ విభిన్న నిర్ణయం ప్రకటించాయని, ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న రెండు పార్టీలు స్టీల్ ప్లాంట్ పై నిర్ణయాన్ని ఇంకా స్పష్టం చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై దెబ్బ కొడుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ‘కూటమిగా ఏర్పడిన  (టీడీపీ, జనసేన, బీజేపీ) పార్టీలు స్టీల్ ప్లాంట్ విషయంలో తమ నైతికతను, విలువలు మరిచాయని విమర్శించారు.

ఒక సున్నితమైన సమస్యగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో ఉక్కు కార్మిక సంఘాల నేతలకు సీఎం ఇచ్చిన హామీ కార్మిక సంఘం నేతల్లోనూ అటు కార్మికులను భరోసా కలిగించినట్లు అయింది. వైసిపి ప్రభుత్వం రాగానే దీనికి పరిష్కార మార్గం కనుక్కుంటామని కూడా సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తాజా పరిణామంతో విశాఖ ఉక్కు కార్మికులు వేలాదిమంది వైఎస్ఆర్ సీపీకే మద్దతుగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

మరోవైపు.. వామపక్ష పార్టీలు కాంగ్రెస్తో కలిసి వెళుతున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సిపికి మద్దతు ఇస్తే మంచిదన్న అభిప్రాయానికి వామపక్ష పార్టీల అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది ఈ తాజాపరిణామం తెలుగుదేశం పార్టీకి బిజెపి అభ్యర్థులకు శరాఘాతంగా మారనుంది.

Show comments