బొబ్బిలిలో టీడీపీ కూటమికి షాక్ !

విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దింటి జగన్మోహన్ రావు వైసీపీలో చేరిపోయారు. ఆయన బీజేపీలో ఉన్నారు. మొదట కాంగ్రెస్ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీలో చేరి ఆ పార్టీకి సేవలందిస్తున్న పెద్దింటికి కూటమి తీరు మింగుడుపడక గుడ్ బై చెప్పారని అంటున్నారు.

బలమైన సామాజిక వర్గానికి చెందిన పెద్దింటి రాకతో వైసీపీ బొబ్బిలిలో బలపడింది. బొబ్బిలి మొదటి నుంచి కాంగ్రెస్ ఆ తరువాత వైసీపీకి కంచుకోట. వైసీపీ ఎప్పుడూ అక్కడ ఓటమి పాలు కాలేదు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని వైసీపీ చూస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు బొబ్బిలి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. బొబ్బిలి రాజులు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు.

బొబ్బిలిలో రాజకీయ యుద్ధం ఆసక్తికరంగా ఉంది. ఈ నేపధ్యంలో బలమైన నేత పెద్దింటి వైసీపీలోకి రావడం కూటమికి షాక్ అనే అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీలోకి మరింతమంది నేతలు వస్తారని చెబుతున్నారు. బొబ్బిలి వైసీపీదే అని ఈసారి కూడా ఓటర్లు తమ వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్ వైసీపీల ద్వారా ఎమ్మెల్యేలుగా గెలిచిన బొబ్బిలి రాజులు సైకిలెక్కాక ఓటమే పలకరిస్తోంది. తమ సొంత పలుకుబడితో అయినా గెలవాలని ఈసారి చూస్తున్నారు. బొబ్బిలిలో మాత్రం టీడీపీ విజయం సాధించి ఇప్పటికి మూడు దశాబ్దాల కాలం దాటిపోయింది. దాంతో సైకిల్ మీద బొబ్బిలి రాజుల సవారీ గెలుపు తీరానికి చేరుస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Show comments