జ‌గ‌న్ ప్ర‌చార షెడ్యూల్ ఖ‌రారు

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌చార షెడ్యూల్ ఖ‌రారైంది. ఇవాళ్టితో మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర ముగిసింది. శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లిలో మేమంతా సిద్ధం భారీ బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ఉత్తేజ‌పూరిత ప్ర‌సంగం చేశారు. మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర ముగిసిన నేప‌థ్యంలో త‌దుప‌రి సీఎం ప్ర‌చారం ఎలా సాగ‌తుందో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

వైసీపీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు మొత్తం 15 రోజుల పాటు ఆయ‌న ప్ర‌చారం సాగుతుంది. రోజుకు మూడు చొప్పున మొత్తం 45 స‌భ‌ల్లో జ‌గ‌న్ పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందించారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందుల‌లో నామినేష‌న్ సంద‌ర్భంగా నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ ప్ర‌త్యేక‌మ‌ని చెప్పొచ్చు.

ప్ర‌చారంలో భాగంగా చివ‌రి స‌భ తిరుప‌తిలో మే 11వ తేదీ జ‌ర‌గ‌నుంది. తిరుప‌తిలో ఎన్నిక‌ల ప్ర‌చార ముగింపు స‌భ నిర్వ‌హించ‌డం సీఎం జ‌గ‌న్ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ తిరుప‌తిలో చివ‌రి స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. బ‌హుశా గురువారం జ‌గ‌న్ ప్ర‌చార షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం వుంది. ముందుగా ఒక వారానికి సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఎన్నిక‌లు ముంచుకొస్తుండ‌డంతో ఒక్క‌రోజు కూడా వృథా చేయొద్ద‌ని ల‌క్ష్యంతో జ‌గ‌న్ దూసుకెళుతున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబునాయుడు కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారం గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయ‌న మూడ్ ఎప్పుడెలా వుంటుందో ఆయ‌న‌కే తెలియ‌దు. 

Show comments