కూటమిది రాంగ్ డెసిషనేనా?

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటుని బీజేపీకి కేటాయించడం ఒక వ్యూహాత్మక తప్పిదని అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. ఈ సీటులో రాజకీయంగా సామాజికంగా చూసినా బలం అంతా టీడీపీకే ఉందని లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఎచ్చెర్లలో బలమైన సామాజిక వర్గంగా తూర్పు కాపులు ఉన్నారు. వీరంతా ప్రతీ ఎన్నికల్లో పార్టీలను మార్చి ఓట్లేస్తూ ఉంటారు. అటూ ఇటూ వీరే ఉంటారు. కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సామాజిక వర్గానికి ఢొకా లేకుండా పోతోంది.

అయితే మొదటిసారి ఎచ్చెర్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు కూటమి టికెట్ ఇచ్చింది. పైగా బీజేపీ పార్టీ తరఫున. ఈ రెండూ వర్కౌట్ కావని టీడీపీ తమ్ముళ్లు అంటున్నారుట. నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది అలాగే బీజేపీ బలం లేదని అటువంటి పార్టీని పట్టుకుని ఎలా ముందుకు సాగుతామని అంటున్నారు.

కిమిడి కళా వెంకటరావుకైనా లేక కలిశెట్టి అప్పలనాయుడుకు అయినా టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

లేని పక్షంలో సీటు మీద ఆశలు వదిలేసుకోవడమే అంటున్నారు. బీజేపీ టీడీపీ పెద్దలు కూడబలుక్కుని ఈ సీటుని ఇలా చేశారు అని తమ్ముళ్ళు మండిపడుతున్నారు. ఎచ్చెర్లలో వైసీపీ వీక్ గా ఉందని ఈ పరిణామాలతో ఆ పార్టీకి గెలిచే అవకాశాలు మెరుగు అవుతున్నాయని అంటున్నారుట.

అయితే బీజేపీని గెలిపిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంగబలం అర్ధబలం కలిగిన నేత కావడం వల్లనే బీజేపీ నేతకు టికెట్ ఇచ్చారని వారు అంటున్నారు.

Show comments