వైసీపీ దూసుకుపోతోంది.. కూటమి తేల్చడం లేదు!

విశాఖ సౌత్ సీటులో టీడీపీ కూటమి అభ్యర్ధి ఎవరో ఇంకా తేల్చలేదు. ఈ సీటు పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు ఇస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. జనసేన నుంచి వైసీపీ నుంచి ఆ పార్టీలోకి వచ్చిన నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తారు అని కూడా అంతా అనుకున్నారు. వంశీ తన ప్రచారం కూడా ప్రారంభించారు.

ఇంతలో కొంత రచ్చ జనసేన నుంచే జరిగింది. దాంతో విశాఖ సౌత్ సీటు వంశీకి డౌట్ లో పడింది అని అనుకున్నారు. తాజాగా చూస్తే పవన్ కళ్యాణ్ మంగళగిరికి వంశీని పిలిపించుకుని మాట్లాడారు అని ఆయనకే టికెట్ అని హామీ ఇచ్చారని ప్రచారం సాగింది. అయితే అధికారిక ప్రకటన అయితే పార్టీ నుంచి రాలేదు. వంశీయే అభ్యర్ధి అని ఓపెన్ గా ప్రకటించలేదు

దాంతో ఈ సీటు విషయంలో ఇంకా డైలామా సాగుతోంది. ఈ సీటుని బీజేపీ అడుగుతోంది. ఆ పార్టీకి ఇస్తారా లేక టీడీపీ కూడా పోటీ చేయాలని చూస్తోంది ఆ పార్టీ తీసుకుంటుందా అన్న దాని మీద కూడా అంతా చర్చ సాగుతోంది.

వంశీకి విశాఖ తూర్పుతో పాటు భీమిలీలో కొంత బలం ఉంది. ఆయన సామాజిక వర్గం ఓట్లు భీమిలీలో ఎక్కువ. దాంతో ఆ సీటుని ఆయన కోరుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆ విషయంలో జనసేన పెద్దలు కూడా కొంత ప్రయత్నం చేశారు అని అంటున్నారు. విశాఖ సౌత్ ని టీడీపీకి వదిలిపెట్టి భీమిలీ తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఆ సీటు ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా అంటోందని తెలుస్తోంది.

అయితే ఈ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతుండడం వల్లనే జనసేన విశాఖ సౌత్ మీద ప్రకటన చేయడంలేదని అంటున్నారు. సౌత్ లో వంశీకి టికెట్ ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్న సందేహాలు ఉన్నాయని అంటున్నారు. అదే భీమిలీ సీటు జనసేన తీసుకుంటే కచ్చితంగా గెలిచే సీటు అవుతుందని ఆ పార్టీ నమ్ముతోంది. కానీ టీడీపీ నుంచి సానుకూల స్పందన రావడం లేదు అని అంటున్నారు.

Show comments