'వరలక్ష్మి' కి మరో చాన్స్

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు తెలుగులో అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. క్రాక్, నాంది సినిమాలు వరలక్ష్మి ని ఫుల్ బిజీగా మార్చేసాయి. 

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలో అవకాశం వచ్చిందని వార్తలు ఇప్పటికే వచ్చాయి. లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ అందించే 'హను..మాన్' సినిమాలో కూడా వరలక్ష్మిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో కీలకమైన పాత్రకు వరలక్ష్మిని తీసుకున్నారు. ఇప్పటికి ఇంకా ఈ సినిమాకు హీరోను డిసైడ్ చేయలేదు. జాంబిరెడ్డి సినిమాలో నటించిన తేజ సజ్జానే ఈ సినిమాలో కూడా హీరోగా చేస్తాడని ప్రచారం అయితే మొదలైంది. 

ఫుల్ సౌండ్ పార్టీ అయిన తేజ అయితే ప్రాజెక్టు కేక్ వాక్ అయిపోతుంది అందుకే అతన్నే తీసుకున్నారనే ప్రచారం మొదలైందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

బహుశా ప్రశాంత్ వర్మకు కూడా అంతకన్నా గొప్ప ఛాయిస్ మరోటి ఇప్పట్లో దొరక్కపోవచ్చు. ఎందుకంటే అందరూ బిజీగా వున్నారు కదా?

Show comments