కేబినెట్ లో ఏకంగా 13 మంది మంత్రులకు కరోనా

దేశంలోనే అత్యథిక కొవిడ్ కేసులున్న రాష్ట్రం మహారాష్ట్ర. కరోనా సోకిన 100మందిలో దాదాపు ముగ్గురు మృత్యువాత పడుతున్నారక్కడ. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పదే పదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ 'మహా' మంత్రులు మాత్రం ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోలేదు. ఫలితంగా ఏకంగా 13 మంది మంత్రులు కరోనా బారిన పడ్డారు.

ముఖ్యమంత్రి సహా మహారాష్ట్రలో మొత్తం 43మంది మంత్రులున్నారు. వారిలో ఏకంగా 13మంది ఒకేసారి కొవిడ్ బారిన పడ్డారు. వీరి నిర్లక్ష్యానికి ఎవరిని నిందించాలి. పార్లమెంట్ సమావేశాలైనా, అసెంబ్లీ సమావేశాలైనా అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. అలాంటిది మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్లు మరీ అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారా అనే అనుమానం రాకమానదు. దీనంతటికీ కారణం మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండేగా తేల్చారు.

ఇటీవల ఏక్ నాథ్ షిండేకి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తూ ఆయన క్వారంటైన్ కి వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితమే మహారాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి హాజరైనవారంతా ఏక్ నాథ్ షిండేతో సన్నిహితంగా ఉన్నవారే. అందరూ టెస్ట్ చేయించుకోగా అందులో 12మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. అలా ఏక్ నాథ్ తో కలిపి మొత్తం మహారాష్ట్ర కేబినెట్ లో 13మందిని కరోనా చుట్టేసింది. 

భాతికదూరం పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని వైద్యులు తేల్చారు. ఇప్పటి వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలా జరగలేదు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు కరోనా బారిన పడ్డా.. ఈ స్థాయిలో ఒకే రాష్ట్రంలో ఒకే సారి ఇంతమందికి వ్యాధి సోకలేదు. కచ్చితంగా సదరు మంత్రుల నిర్లక్ష్యమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. 

అందరూ కలిసి బైటకి పంపేశారు

Show comments