శౌర్య సరసన కేతిక శర్మ

తొలి సినిమా రొమాంటిక్ ఇంకా విడుదల కాకపోయినా, అప్పుడు టాలీవుడ్ దృష్టిని ఆకర్షించేసింది హీరోయిన్ కేతిక శర్మ. ఎంతయినా డైరక్టర్ పూరి జగన్నాధ్ సెలక్షన్, ప్రెజెంటేషన్ ఆ రేంజ్ లో వుంటుంది కదా? అందుకే అసలే సరైన హీరోయిన్ల కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ దృష్టి కేతిక శర్మ మీద పడింది.

ఏస్ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ నిర్మాతగా మారి హీరో నాగశౌర్యతో సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో నిర్మించే సినిమాకు కేతిక శర్మను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విలువిద్య నేఫథ్యంలో తయారయ్యే ఈ సినిమా కోసం నాగశౌర్య డిఫరెంట్ గెటప్ ట్రయ్ చేస్తున్నాడు. పైగా సిక్స్ ప్యాక్ కూడా చేసాడు.

కరోనా కల్లోలం ముగియగానే సెట్ మీదకు వెళ్లే ఈ సినిమాలో కాస్త గట్టి స్టార్ కాస్ట్ ప్యాడింగ్ వుంది. కేతిక శర్మ నటించిన రొమాంటిక్ సినిమా ఆల్ మోస్ట్ పూర్తయింది. లాక్ డౌన్ అయిపోతే, ఈ సినిమాను ఫినిష్ చేసి వీలయినంత త్వరగా విడుదల చేసే ఆలోచనలో వున్నారు నిర్మాతలు పూరి-చార్మి. ఆ సినిమా లో బాగా అందాలు ఆరబోసింది కేతిక శర్మ. అది విడుదలయితే శౌర్య సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది. 

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?

Show comments